Junior NTR: చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగండి: అచ్చెన్నాయుడు

 Ask Junior NTR why he didnt respond on Chandrababu arrest says Atchannaidu
  • చంద్రబాబు అరెస్ట్ పై ఇంతవరకు స్పందించని జూనియర్ ఎన్టీఆర్
  • ఎందుకు స్పందించలేదో నన్ను అడిగితే ఏం చెపుతానన్న అచ్చెన్న
  • స్పందించాలని ఎవరినీ అడగబోమని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రోజులు గడుస్తున్నా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంత వరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి కూడా మీడియా సమావేశంలో ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ... జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలని చెప్పారు. పోయి ఆయననే అడిగితే సమాధానం చెపుతాడని, తనను అడిగితే తాను ఏం చెపుతానని అన్నారు. స్పందించాలని తాము ఎవరినీ అడగమని చెప్పారు. జనసేనతో పొత్తుపై స్పందిస్తూ... రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన నేతలు, కార్యకర్తలు ఖండిస్తున్నారని చెప్పారు. టీడీపీ చేపట్టిన దీక్షల్లో జనసేన శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయని తెలిపారు.
Junior NTR
Tollywood
Chandrababu
Atchannaidu
Telugudesam

More Telugu News