apple: ఫ్రాన్స్‌లో ఐఫోన్12 నిషేధం, యాపిల్ ఇంక్ కీలక ప్రకటన!

Apples Big Move After France Bans iPhone 12 Due To High Radiation

  • అధిక రేడియేషన్ కారణంగా ఐఫోన్12ను నిషేధించిన ఫ్రాన్స్
  • సాఫ్టువేర్ అప్ డేట్ అంటూ స్పందించిన యాపిల్ ఇంక్
  • త్వరలో కొత్త అప్ డేట్ వస్తుందని యాపిల్ చెప్పిందన్న డిజిటల్ మంత్రి

అధిక రేడియేషన్ కారణంతో ఫ్రాన్స్ ఐఫోన్12ను నిషేధించింది. దీంతో యాపిల్ ఇంక్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. సాఫ్టువేర్ అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. దీనివల్ల అధిక రేడియేషన్ సమస్య పరిష్కారమవుతుందని, దీంతో ఫ్రాన్స్‌లో ఐఫోన్12 విక్రయాలకు మార్గం సుగమమవుతుందని యాపిల్ ఇంక్ స్పష్టం చేసింది. ఈ మోడల్ ఫోన్ యూరోపియన్ యూనియన్ రేడియేషన్ నిబంధలకు విరుద్ధంగా ఉందని ఫ్రాన్స్ నిషేధించడంతో ఈ ప్రభావం యూరోప్ అంతటా ఉంటుందని యాపిల్ ఇంక్ భావించింది. దీంతో సత్వర పరిష్కార చర్యలు చేపట్టింది.

ఫ్రెంచ్ రెగ్యులేటర్ ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఫ్రాన్స్‌లోని వినియోగదారుల కోసం తాము సాఫ్టువేర్ అప్ డేట్‌ను జారీ చేస్తామని యాపిల్ ఇంక్ స్పష్టం చేసింది. ఐఫోన్ 12 విక్రయాలు ప్రాన్స్‌లో ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపింది. సాఫ్టువేర్ అప్ డేట్ ద్వారా ఐఫోన్12 ఫ్రెంచ్ రెగ్యులేటర్ల నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించింది.

అధిక రేడియేషన్ నేపథ్యంలో ఐఫోన్12 అమ్మకాలను నిలిపివేసిన ఫ్రాన్స్... యాపిల్ ఇంక్ తాజా నిర్ణయాన్ని స్వాగతించింది. డిజిటల్ మినిస్టర్ జీన్ నోయల్ బారోట్ మాట్లాడుతూ... మరికొన్ని రోజుల్లో ఈ ఫోన్ కొత్త అప్ డేట్ వస్తుందని యాపిల్ ఇంక్ తెలిపిందన్నారు. ఫ్రాన్స్ రేడియేషన్ వాచ్ డాగ్, రేడియేషన్ స్థాయి అనుమతించదగిన పరిమితిలో ఈ కొత్త సాఫ్టువేర్ అప్ డేట్‌లో ఉందో లేదో తనిఖీ చేస్తామని డిజిటల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్రాన్స్ తర్వాత బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్ ఐఫోన్12లోని అధిక రేడియేషన్‌పై ఆందోళన వ్యక్తం చేశాయి.

  • Loading...

More Telugu News