nominee details: నామినేషన్ ఇవ్వకపోతే ఫండ్స్, స్టాక్స్ పెట్టుబడుల బ్లాక్

Give nominee details for mutual funds by this date to avoid MF folio getting frozen
  • ఇన్వెస్టర్లు అందరూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి
  • లేదంటే నామినేషన్ ఆప్ట్ అవుట్ ఆప్షన్ ఇవ్వాలి
  • సెప్టెంబర్ 30 తో ముగియనున్న గడువు
ఇన్వెస్టర్లు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన గడువు ఒకటి ముంచుకొస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి దారులు, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు ఈ నెల 30వ తేదీ నాటికి తమ పెట్టుబడుల ఖాతాలకు నామినేషన్ ను ఇవ్వడం తప్పనిసరి. అయితే నామినేషన్ ఇవ్వాలి. లేదంటే నామినేషన్ వద్దంటూ ఆప్ట్ అవుట్ చేసుకోవాలి. లేకపోతే ఆ పెట్టుబడులకు సంబంధించి లావాదేవీలు నిర్వహించడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే అవి స్తంభనకు గురవుతాయి. 

వాస్తవానికి నామినేషన్ గడువు ఈ ఏడాది మార్చి 31నే ముగిసింది. వివిధ మార్కెట్ భాగస్వాముల నుంచి వచ్చిన వినతుల మేరకు గడువు పొడిగిస్తూ సెబీ నిర్ణయం ప్రకటించింది. ఆన్ లైన్ లోనే స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి ఇన్వెస్టర్లు సులభంగా నామినేషన్ ఇవ్వొచ్చు. డీమ్యాట్ ఖాతాలకు సంబంధించి కూడా స్టాక్ బ్రోకర్లు లేదంటే సీడీఎస్ఎల్, ఎన్ఎస్ డీఎల్ పోర్టల్ పై నమోదు చేసుకోవచ్చు. నామినీ వద్దనుకుంటే ఆప్ట్ అవుట్ నామినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించి క్యామ్స్ లేదా కే ఫిన్ టెక్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు.
nominee details
mutual funds
stocks
deadline
september 30

More Telugu News