CPI Narayana: కల్వకుంట్ల కవిత చెప్పిన వెంటనే కోర్టు నమ్మేసింది: సీపీఐ నారాయణ
- సెప్టెంబర్ 26 వరకు కవితకు సమన్లు జారీ చేయొద్దని సుప్రీం ఆదేశాలు
- కవితకు ఇష్టమయినప్పుడు వెళ్లాలని కోర్టు చెప్పిందని ఎద్దేవా
- మోదీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా అని ప్రశ్న
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఇచ్చిన సమన్లను సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ విమర్శలు గుప్పించారు. విచారణకు రావాలని ఈడీ సమన్లు పంపిస్తే... కవితకు ఇష్టమయినప్పుడు వెళ్లాలని కోర్టు చెప్పిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను బిజీగా ఉన్నానని కవిత చెప్పగానే కోర్టు నమ్మేసిందని అన్నారు. ప్రధాని మోదీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా? అని ప్రశ్నించారు.