Anantnag Encounter: అనంత్‌నాగ్‌లో ఆరో రోజూ కొనసాగుతున్న ఎన్‌కౌంటర్.. కాలిన ఉగ్రవాది మృతదేహం స్వాధీనం

Anantnag encounter Charred body of terrorist recovered

  • ఎన్‌కౌంటర్‌లో అమరులైన నలుగురు భద్రతాధికారులు
  • ఈ తెల్లవారుజామున ప్రారంభమైన సెర్చ్ ఆపరేషన్
  • నిన్న కూడా తీవ్రస్థాయిలో కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వరుసగా ఆరో రోజూ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భద్రతా దళాలు కాలిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అది ఉగ్రవాదిదే అయి ఉంటుందని భావిస్తున్నారు. డ్రోన్ ద్వారా ఆ ప్రాంతంలో గుర్తించిన ఉగ్రవాది, సైనికుడి మృతదేహాల కోసం ఈ తెల్లవారుజామున భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి కొనసాగిస్తున్నాయి. 

ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం కూడా తీవ్రస్థాయిలో కాల్పులు కొనసాగాయి. అయితే, నేడు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కాల్పులు జరగలేదు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రతాధికారులు అమరులయ్యారు. వీరిలో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ మేజర్ ఆశిష్ ధోంచక్, డీఎస్పీ హుమయూన్ భట్, మరో సైనికుడు అమరులయ్యారు.

  • Loading...

More Telugu News