Khairatabad Ganesh: తొలి పూజ అందుకున్న ఖైరతాబాద్ గణేశుడు
- హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని హాజరు
- పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్
- మహా గణేశుడిని దర్శించుకోనున్న గవర్నర్ దంపతులు
ఖైరతాబాద్ మహా గణేశుడికి పూజలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగిన తొలి పూజలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి నేతలు హారతిచ్చారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ ఏడాది 63 అడుగుల భారీ ఆకారంతో దశవిద్య మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గణపతికి కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బారీకేడ్లు ఏర్పాటు చేసినట్లు ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవ కమిటీ వెల్లడించింది.