Justin Trudeau: ప్రధాని ట్రూడూ వాస్తవాలతో ముందుకు రావాలి: కెనడా ప్రతిపక్ష నేత డిమాండ్
- హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందన్న ట్రూడూ
- కెనడా ప్రజలు తేల్చుకుంటారన్న ప్రతిపక్ష నేత పొలీవర్
- ప్రధాని ఎలాంటి వాస్తవాధారాలను అందించలేదని వ్యాఖ్య
ఖలిస్థాన్ నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ చేసిన ఆరోపణల పట్ల ఆ దేశ ప్రతిపక్ష నేత, కన్జర్వేటివ్ పార్టీ లీడర్ పిర్రే పొలీవర్ సీరియస్ గా స్పందించారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ తాను చేసిన ఆరోపణలకు సంబంధించి అన్ని వాస్తవాలను ట్రూడూ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.