drugs: హీరో నవదీప్‌ను విచారించనున్న పోలీసులు

Police will send notices to notices to actor Navadeep
  • డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నవదీప్
  • తనను అరెస్ట్ చేయకుండా చూడాలని హైకోర్టును ఆశ్రయించిన నటుడు
  • విచారణకు సహకరించాల్సిందేనని హైకోర్టు ఆదేశం
మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నవదీప్‌కు 41ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నేడో, రేపో నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన విచారణకు హాజరుకాకుంటే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నవదీప్‌తో పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు కూడా వినిపించింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా చూడాలని నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు విచారణకు సహకరించాలని నవదీప్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీసులకు సూచించింది.
drugs
Tollywood
Telangana
Andhra Pradesh

More Telugu News