Sensex: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses

  • మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిన అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు
  • 796 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 231 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 796 పాయింట్లు నష్టపోయి 66,800కి పడిపోయింది. నిఫ్టీ 231 పాయింట్లు కోల్పోయి 19,901కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.32%), ఏసియన్ పెయింట్స్ (0.61%), సన్ ఫార్మా (0.45%), ఐటీసీ (0.24%), యాక్సిస్ బ్యాంక్ (0.22%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-4.00%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.60%), రిలయన్స్ (-2.21%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.94%), మారుతి (-1.65%).

  • Loading...

More Telugu News