Canada: భారత్ తో పెట్టుకుంటే ఒంటరి కావాల్సిందే..!
- ఖలిస్థాన్ ఉగ్రవాది హత్యను సంచలనం చేయాలనుకున్న కెనడా
- భారత్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు
- ఆధారాలు బయటపెట్టకుండా అడ్డగోలు ప్రకటన
- తగినంత మద్దతు లభించని వైనం
- భారత్ తో భాగస్వామ్యానికి అగ్రరాజ్యాల ప్రాధాన్యం
- భారత్ పాత్రను నిరూపిస్తేనే కెనడాకు దౌత్య విజయం
ఒకవైపు 140 కోట్ల జనాభాతో, ప్రపంచంలో వేగంగా వృద్ధిని సాధిస్తూ, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి (3.3 ట్రిలియన్ డాలర్లు) చేరిన భారత్. మరోవైపు 4 కోట్ల జనాభాతో, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో తొమ్మిదో స్థానంలో (1.9 ట్రిలియన్ డాలర్లు) ఉన్న కెనడా. రెండు దేశాల మధ్య వాణిజ్యం 8 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది. ఇంచుమించు ఇరు దేశాలు 4 బిలియన్ డాలర్ల మేర ఏటా మరో దేశానికి ఎగుమతి చేస్తున్నాయి. ఈ సంబంధాలు ఇంకా బలపడాలని భారత్ ఆకాంక్షించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుందామని స్నేహహస్తం చాచింది. అయితే, ఖలిస్థాన్ వేర్పాటువాద అనుకూల ఉగ్రవాది నిజ్జర్ హత్య రెండు దేశాల దౌత్య సంబంధాల మద్య చిచ్చు పెట్టింది.