Nayanthara: దర్శకుడు అట్లీపై నయనతార గుస్సా.. జవాన్‌లో తన పాత్రకు ప్రాధాన్యం లేకుండా చేశారని ఆగ్రహం!

Nayanthara Upset With Atlee After Being Sidelined In Jawan
  • బాక్సాఫీసును కొల్లగొట్టిన జవాన్ సినిమా
  • నయన్-షారూఖ్ మధ్య కుదిరిన కెమిస్ట్రీ
  • తన పాత్రకు కత్తెర వేసి సినిమాను షారూఖ్-దీపిక సినిమాలా మార్చేశారని నయన్ ఆగ్రహం
  • సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన దీపిక
బాలీవుడ్ బాద్షా షారూఖ్‌ఖాన్- లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్‌లో అట్లీకుమార్ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా బాక్సాఫీసు వద్ద సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. షారూఖ్-నయన్ మధ్య కెమిస్ట్రీ సినిమాలో బాగా వర్కవుట్ అయింది. అయితే, సినిమాలో తన కేరెక్టర్‌ను కోసేసి సహ నటి దీపిక పాత్రను హైలెట్ చేశారంటూ దర్శకుడు అట్లీపై నయనతార ఆగ్రహంతో ఉన్నట్టు కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ‘హిందూస్థాన్ టైమ్స్’ సంచలన కథనం ప్రచురించింది.

జవాన్ సినిమాలో విక్రమ్ రాథోడ్ (షారూఖ్) భార్యగా దీపిక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. అయితే అది అతిథిపాత్రలా కాకుండా ప్రధాన పాత్ర అయి కూర్చుందని.. చివరికిది ‘షారూఖ్-దీపిక’ సినిమాలా మారిపోయిందని నయనతార అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆ కథనం పేర్కొంది.

దక్షిణాదిలో అగ్రనటి అయిన నయన్ జవాన్‌లో తనకు దక్కిన ట్రీట్‌మెంట్‌పై ఆమె సంతోషంగా లేరని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జవాన్ ప్రమోషన్ ఈవెంట్లు, సక్సెస్ ప్రెస్‌మీట్లలో నయనతార పాల్గొనకపోవడంపై అడిగిన ప్రశ్నకు.. గతంలో కొన్ని చేదు అనుభవాల కారణంగా ఆమె ఇటువంటి వాటికి దూరంగా ఉంటున్నట్టు ఆ వర్గాలు స్పష్టతనిచ్చాయి. కాగా, నయనతార అద్భుతమైన నటి అంటూ గతంలో షారూఖ్ పొగడ్తల వర్షం కురిపించాడు.
Nayanthara
Jawan Movie
Atlee
Bollywood
Shah Rukh Khan

More Telugu News