vijay antony: కూతురుతో పాటు నేనూ చనిపోయా!: విజయ్ ఆంటోని ఎమోషనల్

Vijay Antony shares 1st statement after daughter Meeras death
  • కూతురు మృతి తర్వాత మొదటిసారి భావోద్వేగంతో పోస్ట్ చేసిన విజయ్ ఆంటోనీ
  • ఇక నుంచి చేయబోయే ప్రతి మంచి పనిని ఆమె పేరునే చేస్తానని స్పష్టీకరణ
  • కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, శత్రుత్వం లేని ప్రదేశానికి వెళ్లిందన్న విజయ్
తన కూతురు మీరా మృతి నేపథ్యంలో నటుడు విజయ్ ఆంటోనీ ఈరోజు మొదటిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చెన్నైలోని వారి నివాసంలో పదహారేళ్ల పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కూతురు మృతిపై విజయ్ ఎక్స్ వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమార్తెతో పాటు తానూ చనిపోయానని, ఇక నుంచి తాను చేయబోయే ప్రతి మంచి పనిని ఆమె పేరునే చేస్తానని, అప్పుడైనా ఆమె తనతో ఉన్నట్లుగా ఉంటుందన్నారు.

తన కూతురు ప్రేమగల, ఎంతో ధైర్యవంతురాలైన అమ్మాయి అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె ఏ కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, శత్రుత్వం లేని ఓ మంచి, నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. తన కూతురు ఇప్పటికీ తనతోనే ఉన్నట్లుగా ఉందని, తాను కూడా కూతురుతో పాటు మరణించానని ఎమోషనల్ అయ్యారు. ఇక నుంచి తాను ఏం చేసినా ఆమె కోసమే చేస్తానన్నారు. చెన్నైలోని ఓ ప్రయివేటు పాఠశాలలో మీరా పన్నెండో తరగతి చదువుతోంది.
vijay antony
daughter
cinema

More Telugu News