SFJ video: హిందువులు వెళ్లిపోవాలన్న సిక్కు సంస్థ ప్రకటనను ఖండించిన కెనడా మంత్రులు

Canadian ministers condemn SFJ video asking Hindus of Indian origin to leave nation

  • రెండు రోజుల క్రితం సిఖ్ ఫర్ జస్టిస్ అల్టిమేటం
  • దీన్ని ఖండించిన కెనడా మంత్రి లేబ్లాంక్
  • కెనడా అనుసరిస్తున్న విలువలకు విరుద్ధమని ప్రకటన

భారత సంతతికి చెందిన హిందువులు కెనడా విడిచి వెళ్లిపోవాలంటూ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) ఇటీవల చేసిన హెచ్చరికను కెనడా మంత్రులు ఖండించారు. ‘‘ఇండో-హిందువులూ కెనడాను వీడండి. భారత్ కు వెళ్లిపోండి. భారత్ కు మీరు మద్దతుగా నిలవడమే కాదు, ఖలిస్థాన్ అనుకూల సిక్కుల భావ వ్యక్తీకరణ అణచివేతకు సైతం మద్దతు తెలుపుతున్నారు’’ అంటూ ఎస్ఎఫ్ జే లీగల్ కౌన్సిల్ గుర్ పట్వంత్ పన్నమ్ ఓ వీడియో మెస్సేజ్ ను విడుదల చేశారు. దీంతో హిందూ కమ్యూనిటీకి చెందిన కెనడా వాసులు ఎస్ ఎఫ్ జే హెచ్చరికపై మంత్రి లేబ్లాంక్ కు లేఖ రాశారు. ఖలిస్థాన్ అనుకూల వర్గాల నుంచి బెదిరింపులు వస్తున్నందున దేశంలో నివసించే హిందూ వాసులకు భద్రత కల్పించాలని కోరారు.  

దీంతో ఈ పరిణామంపై కెనడా ప్రజా భద్రతా మంత్రి డొమినిక్ లేబ్లాంక్ స్పందించారు . కెనడా వాసులు అందరూ తమ కమ్యూనిటీ పరిధిలో సురక్షితంగా ఉండడానికి అర్హులని పేర్కొన్నారు. ‘‘హిందూ కెనడియన్లను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ లో ద్వేషపూరిత వీడియోను పంపిణీ చేయడం అన్నది కెనడా వాసులుగా మేము అనుసరిస్తున్న విలువలకు విరుద్ధం’’ అని లేబ్లాంక్ పేర్కొన్నారు. సదరు వీడియోని అసహ్యకర, ద్వేషపూరితమైనదిగా అభివర్ణించారు. అత్యవసర సేవల మంత్రి హర్జీత్ సజ్జన్ సైతం లేబ్లాంక్ మాదిరే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News