vijay: లియో హిందీ వెర్షన్ విడుదలకు ఇక్కట్లు

 Leo faces Hindi Release troble

  • లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమాపై భారీ అంచనాలు
  • నాలుగు వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనున్న విజయ్ సినిమా
  • మల్టీప్లెక్సుల్లో హిందీ సినిమా విడుదలవ్వాలంటే 8 వారాల విరామం ఉండాలన్న ఒప్పందంతో సమస్య

ఖైదీ, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ -కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం లియో. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. టైటిల్‌ ప్రోమో గ్లింప్స్, పోస్టర్లు చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌, శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ మీనన్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. పలు భాషల్లో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు హిందీలో అవాంతరం ఎదురైంది.

పీవీఆర్, ఐనాక్స్, సినిపాలిస్ వంటి నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లో ఏ భారతీయ సినిమా హిందీ వెర్షన్ విడుదల కావాలన్నా.. కనీసం 8 వారాల గ్యాప్ తర్వాత గానీ ఓటీటీలో ప్రదర్శించకూడదన్న ఒప్పందం ఉంది. అయితే, నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న లియో థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమ్ అవనుంది. ఇదే లియో హిందీ వెర్షన్ రిలీజ్ కు అడ్డంకిగా మారింది. ప్రస్తుతానికి పీవీఆర్, ఐనాక్స్, సినీపాలిస్ లో హిందీ వెర్షన్ విడుదల సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News