Chandrababu: చంద్రబాబు కస్టడీ నేపథ్యంలో సీఐడీకి జడ్జి విధించిన కండిషన్స్ ఇవే!
- చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు
- విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదని ఆదేశం
- చంద్రబాబు లాయర్ల సమక్షంలో విచారణ జరగాలని కండిషన్
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతినిస్తూ ఏసీబీ కోర్టు తీర్పును వెలవరించింది. ఈ సందర్భంగా సీఐడీకి ఏసీబీ కోర్టు జడ్జి పలు కండిషన్లను విధించారు.
- విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదు
- విచారణ వివరాలను మీడియాకు వెల్లడించకూడదు
- కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో ఇవ్వాలి
- విచారణ అధికారుల వివరాలు ఇవ్వాలి
- చంద్రబాబును ఆయన లాయర్ల సమక్షంలోనే విచారించాలి
- చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
- చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
- చంద్రబాబు విచారణను తాము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం
- కస్టడీ ముగిసిన వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలి.