Priyamani: తనను 'ఆంటీ' అన్న నెటిజన్ కు ప్రియమణి ఘాటు రిప్లై

Priyamani reply to a netizen who called her aunty
  • వయసు పెరిగితే సిగ్గు పడాల్సిన అవసరం లేదన్న ప్రియమణి
  • 38 ఏళ్ల వయసులో కూడా హాట్ గా ఉన్నానని కామెంట్
  • నోరు మూసుకో అంటూ నెటిజన్ కు ఘాటు సమాధానం
సినీ తారలపై నెటిజన్ల ట్రోలింగ్స్ సాధారణమే. వాటికి సెటెబ్రిటీలు కౌంటర్ ఇవ్వడం కూడా సర్వసాధారణమే. ఈసారి ప్రియమణి వంతు వచ్చింది. ప్రియమణిని ఉద్దేశించి కొందరు బ్లాక్ ఆంటీ అని కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్లను ఆమె ఇంత కాలం పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఘాటుగా రియాక్ట్ అయింది. ప్రియమణిని ఓ నెటిజన్ ఆంటీ అని సంబోధించాడు. దీనిపై ప్రియమణి స్పందిస్తూ... ఇలాంటి కామెంట్లను తాను లైట్ గా తీసుకుంటానని చెపుతూనే సదరు నెటిజన్ పై మండిపడింది. తనను ఆంటీ అని పిలవడాన్ని తాను పట్టించుకోనని చెప్పింది. వయసు పెరిగితే సిగ్గు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. వయసు పెరగడం అనేది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ అని చెప్పింది. ప్రస్తుతం తన వయసు 38 ఏళ్లని... అయినా ఇప్పటికీ హాట్ గానే ఉన్నానని తెలిపింది. ఇక నువ్వు నోరు మూసుకో అని ఘాటుగా సమాధానమిచ్చింది.
Priyamani
Tollywood
Bollywood

More Telugu News