Manchu Lakshmi: నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? ఇంకెవరి కోసమో బతకొద్దు: మంచు లక్ష్మీ వీడియో

Manchu Laxmi video on money and happiness

  • బిజినెస్ క్లాస్‌లో వెళ్లడం, ఐఫోన్ ఉండటంపై తనను ప్రశ్నించారంటూ ఆసహనం
  • నువ్వేమైనా డబ్బులిస్తున్నావా? అంటూ ప్రశ్న
  • జీవితం చాలా చిన్నది నీకోసం నువ్వు బతకాలంటూ హితవు
  • డబ్బు అంటే సంతోషం కాదని, స్వేచ్ఛని ఇస్తుందన్న మంచు లక్ష్మి

నా కష్టం, నా సంపాదన, నా డబ్బు, నా ఖర్చు అంటూ సినీ నటి మంచు లక్ష్మీ ఎక్స్ వేదికగా ఓ వీడియోను ట్వీట్ చేశారు. డబ్బు తనకు స్వేచ్ఛను ఇస్తోందని పేర్కొన్నారు. ఇటీవల ఓ విమానాశ్రయంలో కార్పెట్ పరిశుభ్రంగా లేదని ఫోటో పెట్టానని, తాను ఐఫోన్‌తో ఫోటో తీయడం వల్ల బాగా కనపడుతోందని పేర్కొన్నారు. దీనిని చూసిన కొంతమంది ఓహో నువ్వు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నావా? నీకు ఐఫోన్ ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నువ్వేమైనా కొనిచ్చావా నాకు? నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? అని ఘాటుగా ప్రశ్నించారు. నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నట్లు? ఏం చేసినా తప్పేనా? బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం, ఐఫోన్ వాడటం తప్పు అన్నట్లు మాట్లాడుతారా? అన్నారు.

ముఖ్యంగా మహిళ విషయంలో, ఏది చేసినా చూపించకూడదు, చెప్పకూడదు, చేయకూడదు.. ఏమిటి అసలు ప్రాబ్లమ్? అన్నారు. తాను చాలా కష్టపడతానని, తనకు ఎవరు ఉత్తినే డబ్బులు ఇవ్వరన్నారు. తన తండ్రి, తల్లి కూడా ఇవ్వరని చెప్పారు. నేను పడిన కష్టం మీరు కూడా పడాలని తన తండ్రి తనకు నేర్పారన్నారు. 

ఇంట్లో ఉండి వంట చెయ్, సామాన్లు తోము, నీ పిల్లల్నే చూసుకో, నీ కెరియర్‌నే చూసుకో.. ఇవన్నీ తప్పు  అన్నారు. తనకు సొంతగా విమానం కావాలనీ, మీకు వద్దా? పెద్దగా ఆలోచించరా? అని ప్రశ్నించారు. మీకు ఏం కావాలో అది చేయాలన్నారు. డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని అందరూ అనుకుంటారని, దీంతో తాను ఏకీభవించనని చెప్పారు. తన జీవితంలో తాను చాలా డబ్బు చూశానని, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ మాత్రమే కాదని, తాను డైమండ్లతో కూడిన బంగారు స్పూన్‌తో పెరిగానన్నారు.

డబ్బులు అంటే సంతోషం కాదని, డబ్బు ఏమిస్తుందో తెలుసా? స్వేచ్ఛను ఇస్తుందన్నారు. లోతుగా ఆలోచిచిస్తే తెలుస్తుందని, డబ్బు అంటే సంతోషమని, స్టేటస్ అని, ఫేమ్ అనే వాటిని పక్కన పెడితే, స్వేచ్ఛను ఇస్తుందని తెలుసుకోవాలన్నారు. వంట చేయడం తప్పు కాదని, పిల్లల్ని చూడటం తప్పుకాదని, కానీ అదే చేయాలని పట్టుబట్టడం తన దృష్టిలో తప్పన్నారు. నిన్న చేసిన ట్వీట్ తనను ఇంతలా ఆలోచించేలా చేసిందన్నారు.

మనది చాలా చిన్న లైఫ్ అని, అది చిటికె వేసేంత జీవితమని, అలాంటప్పుడు నీ కోసం కాకుంటే ఎవరి కోసం బతుకుతున్నావు? నీ కోసం కాకుండా ఎవరి కోసం బతకాలి? ఇంకెవరి కోసమో బతికే బతుకు ఒక బతుకా? ఒక లైఫా? వారు ఏమైనా మీ ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారా? ట్యూషన్ ఫీజు కడుతున్నారా? మీ ఈఎంఐలను ఏమైనా కడుతున్నారా? మీ జీవితంలో ఇతరుల ఆలోచనలను రుద్దకండి అని సూచించారు. అలాంటి తప్పు చేయవద్దన్నారు.

  • Loading...

More Telugu News