sleeping: రాత్రి నిద్ర ఆలస్యమైతే మధుమేహాన్ని ఆహ్వానించినట్టే!

5 reasons sleeping late at night is increasing your diabetes risk
  • ఆలస్యమయ్యే నిద్రలో నాణ్యత ఉండదు
  • ఫలితంగా మధుమేహంతోపాటు ఎన్నో సమస్యలు
  • సిర్కాడియం రిథమ్ గాడి తప్పే ప్రమాదం
మారిన జీవనశైలి, పని నమూనాలతో రాత్రి నిద్ర ఆలస్యమవుతోంది. ఒకప్పుడు రాత్రి 9 గంటలకే నిద్రపోయి, పొద్దున్నే 5-6 గంటలకు నిద్ర లేచేవారు. సూర్యోదయం పూర్వం నిద్ర లేచే ఈ ప్రకృతి అనుకూల జీవనంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ, కాలక్రమంలో నిద్ర వేళల్లో ఎంతో మార్పు వచ్చింది. అర్ధరాత్రి 12 తర్వాత నిద్రకు ఉపక్రమించే వారు ఎక్కువగా ఉంటున్నారు. కొందరు అయితే రాత్రి 2-3 గంటలకు కానీ, నిద్రపోరు. ఇలా రాత్రి ఆలస్యంగా నిద్ర పోవడం అన్నది ఆరోగ్యానికి మా చెడ్డదని పరిశోధనల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల టైప్-2 మధుమేహం బారిన పడే రిస్క్ 19 శాతం పెరుగుతుందని ఇటీవలి అధ్యయనం ఒకటి హెచ్చరించింది. 

ఇలా రాత్రి ఆలస్యంగా నిద్రించే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం.. రోజులో సాయంత్రం తర్వాతే ఎక్కువగా తినడం చేస్తుంటారు. దీనివల్లే మధుమేహం రిస్క్ పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా రాత్రి కూడా మేల్కొని ఉండే వారిని నైట్ ఓల్స్ గా పేర్కొంటారు. వీరికి ఒక్క మధుమేహమే కాదు, మరెన్నో ఆరోగ్య సమస్యల రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

  • శరీర జీవక్రియలు ఒక సహజసిద్ధ సిర్కాడియం రిథమ్ ప్రకారం జరుగుతుంటాయి. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండడం వల్ల ఈ రిథమ్ దెబ్బతింటుంది. అది బ్లడ్ షుగర్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటుంది. 
  • ఇక ఆలస్యంగా నిద్ర పోవడం వల్ల నాణ్యత లోపిస్తుంది. అది నిద్రలేమికి దారితీస్తుంది. ఇది కూడా మధుమేహకారేనని గుర్తుంచుకోవాలి.
  • ఇక రాత్రి ఎక్కువగా మేల్కొని ఉండే వారు ఏదో ఒకటి తింటూ ఉంటారు. ముఖ్యంగా స్నాక్స్ కూడా తింటుంటారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం గాడి తప్పుతుంది.
  • అర్ధరాత్రి వరకూ పడుకోని వారు వ్యాయామాలకు సమయం కేటాయించడానికి వీలు చిక్కదు. వారి షెడ్యూల్ అలా ఉంటుంది. దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
  • బారెడు పొద్దొక్కే వరకూ నిద్రపోయే వారికి సామాజిక సంబంధాలు అంత మెరుగ్గా ఉండవు. దీంతో వారిలో ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
sleeping
late Night
diabetes risk
health problems

More Telugu News