Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్
- ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన బాబు తరపు న్యాయవాదులు
- తెలుగు రాష్ట్రాల్లో సర్వత్ర ఉత్కంఠ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ ను మెన్షన్ చేయనున్నారు. ఈ పిటిషన్ ను ఏ ధర్మాసనంకు ఇవ్వాలనే నిర్ణయాన్ని సీజేఐ నిర్ణయిస్తారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలను వినిపించనున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శనివారం నాడు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో స్పెషల్ లీవ్ పిటిషన్ ను న్యాయవాది గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టులోనైనా ఊరట లభిస్తుందా? లేదా? అనే విషయంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.