Haragopal: చంద్రబాబును జైల్లో పెడితే తనకు తిరుగుండదని జగన్ అనుకున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్

Professor Haragopal says it is benefit to Chandrababu being in jail

  • జగన్ ఆలోచన ఆయనకే నష్టం చేస్తుందన్న హరగోపాల్
  • జైలుకు వెళ్లడం వల్ల చంద్రబాబుకే లాభమని వ్యాఖ్య
  • బాబును అరెస్ట్ చేసిన విధానం బాధాకరమని ఆవేదన

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ దేశ వ్యాప్తంగా పలు పార్టీలు, మేధావులు తమ స్పందనను తెలియజేశారు. తాజాగా ప్రొఫెసర్ హరగోపాల్ స్పందిస్తూ చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. చంద్రబాబును జైల్లో పెడితే రాజకీయంగా తనకు తిరుగు ఉండదని సీఎం జగన్ భావించారని... అయితే ఆయన ఆలోచన ఆయనకే నష్టాన్ని చేకూర్చబోతోందని చెప్పారు. జైలుకు వెళ్లడం వల్ల చంద్రబాబుకే లాభమని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు బీజేపీకి మద్దతిచ్చే సంస్థలుగా మారాయని విమర్శించారు.

చంద్రబాబు ఇమేజ్ పెరుగుతోందనే ఆయనను జగన్ జైల్లో పెట్టించారని హరగోపాల్ అన్నారు. చంద్రబాబు ఒక వ్యూహకర్త అని... ఆయనను జైల్లో పెట్టిస్తే తనకు తిరుగు ఉండదని భావించారని చెప్పారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం వల్ల ఆయనకు ప్రజల్లో సానుభూతి పెరుగుతోందని అన్నారు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను కోల్పోతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఇదే సమయంలో చంద్రబాబుపై హరగోపాల్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి తమకు కూడా ఉంటే బాగుంటుందని తనతో ఇతర రాష్ట్రాల వారు కూడా చెప్పారని తెలిపారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబే అని చెప్పారు. సాఫ్ట్ వేర్ రంగానికి బ్రాండ్ అంబాసడర్ చంద్రబాబే అని కొనియాడారు. గతంలో చైనా నుంచి ఒక బృందం వచ్చిందని... చంద్రబాబును కలవకుండా తాము వెళ్లమని వారు చెప్పారని తెలిపారు.

  • Loading...

More Telugu News