Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ

Governor tamilisai rejects governor quota mlc proposals
  • దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించిన ప్రభుత్వం
  • కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్‌లో చేరిన దాసోజు శ్రవణ్
  • ప్రభుత్వం పంపిన రెండు పేర్లను తిరస్కరించిన గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. కొన్నిరోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన దాసోజు, మాజీ ఎమ్మెల్యే కుర్రాలను ప్రతిపాదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించింది.

అయితే, ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు. వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలను కూడా ఆమె చెప్పారు. దాసోజు, కుర్రాలు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడి కాలేదన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నవారిని సిఫార్సు చేయాలని సూచించారు.
Tamilisai Soundararajan
Telangana
Governor
Dasoju Sravan

More Telugu News