Chandrababu: సెలవులో విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి.. ఇన్ఛార్జ్ జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి

Vijayawada ACB Judge in on leave today
  • చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ పొడిగింపులపై ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ
  • వ్యక్తిగత కారణాలతో ఈరోజు సెలవుపై ఉన్న జడ్జి
  • ఈ పిటిషన్లపై విచారణ జరపాల్సిందిగా ఇన్ఛార్జ్ జడ్జిని కోరనున్న న్యాయవాదులు
స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణలో ఈరోజు కీలక మార్పు చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై ఈరోజు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే, ఇప్పటి వరకు ఈ కేసులను విచారించిన ఏసీబీ జడ్జి ఈరోజు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారు. వారి స్థానంలో ఏసీబీ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి విధులను నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు పిటిషన్లపై విచారణ జరపాల్సిందిగా ఇన్ఛార్జ్ జడ్జిని న్యాయవాదులు కోరనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో, కోర్టులో ఈరోజు ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
Chandrababu
ACB Court
Telugudesam

More Telugu News