Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను రేపు విచారిస్తామన్న చీఫ్ జస్టిస్.. ఎల్లుండి నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు!
- నిన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన మెన్షన్ ఆధారంగా సీజేఐ నిర్ణయం
- రేపు విచారణ జరిపేందుకు చీఫ్ జస్టిస్ అంగీకారం
- స్పెషల్ బెంచ్ సమావేశం నేపథ్యంలో ఈరోజు ప్రస్తావనలకు అనుమతించని చీఫ్ జస్టిస్
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. రేపు విచారణ జరిపేందుకు ఆయన అంగీకరించారు. చంద్రబాబు తరపు లాయర్లు వేసిన మెన్షన్ మెమోపై ఆయన ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఏ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వస్తుందనేది ఈ సాయంత్రంలోగా తెలియనుంది.