Asian Games: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం

India clinches equestrian gold in Asian Games 2023

  • చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ఆసియా క్రీడలు
  • ఇవాళ ఇప్పటివరకు భారత్ కు 4 పతకాలు
  • ఈక్వెస్ట్రియన్ లో స్వర్ణం సాధించిన భారత బృందం
  • సెయిలింగ్ లో భారత్ కు ఒక రజతం, రెండు కాంస్యాలు

చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నేడు భారత్ కు మరో స్వర్ణం లభించింది. ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడ) ఈవెంట్లో డ్రెస్సేజ్ విభాగంలో భారత్ అద్భుత విజయం సాధించింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ఆసియా కప్ లో ఈక్వెస్ట్రియన్ స్వర్ణం గెలవడం విశేషం. భారత ఈక్వెస్ట్రియన్ జట్టులోని సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్, హృదయ్ ఛెడా, అనుష్ అగర్వాలా తమ ఈక్వెస్ట్రియన్ నైపుణ్యంతో భారత్ ఖాతాలో పసిడి పతకం చేర్చారు. 

ఇవాళ ఆసియా క్రీడల్లో భారత్ మరో 3 పతకాలు కూడా లభించాయి. ఈ మూడు పతకాలు సెయిలర్లు సాధించినవే. తొలుత మహిళల డింగీ ఐఎల్ సీఏ4 ఈవెంట్ లో నేహా ఠాకూర్ రజతం సాధించగా, పురుషుల విభాగంలో ఎబాద్ అలీ కాంస్యం సాధించి భారత శిబిరంలో ఆనందం నింపాడు. సెయిలింగ్ లో ఆర్ఎస్-x విండ్ సర్ఫింగ్ ఈవెంట్ లో ఎబాద్ అలీ మూడో స్థానంలో నిలిచాడు. ఎబాద్ అలీ ఈ ఈవెంట్ లో 52 పాయింట్ల నెట్ స్కోరు నమోదు చేశాడు. 

ఇక పురుషుల డింగీ ఈవెంట్ లో విష్ణు శరవణన్ కాంస్యం నెగ్గాడు. ఐఎస్ సీఏ7 విభాగంలో విష్ణు శరవణన్ 34 పాయింట్ల నెట్ స్కోరు నమోదు చేశాడు. తాజా ఫలితాల అనంతరం, హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 14కి పెరిగింది.

  • Loading...

More Telugu News