Srikanth Addala: 'బ్రహ్మోత్సవం' ఫ్లాప్ అయినప్పుడు మహేశ్ ఆ మాట అన్నాడు: శ్రీకాంత్ అడ్డాల

Srikanth Addala Interview
  • 'బ్రహ్మోత్సవం' గురించి ప్రస్తావించిన శ్రీకాంత్ అడ్డాల 
  • ఆ సినిమా ఫ్లాప్ కి తానే కారణమని వెల్లడి 
  • పొరపాటు అక్కడే జరిగిందని వ్యాఖ్య 
  • ఆ ముగ్గురి సపోర్ట్ ఊరటనిచ్చిందని వివరణ
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా చేసిన 'బ్రహ్మోత్సవం' సినిమా పరాజయం పాలైంది. భారీ తారాగణంతో .. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను నిరాశపరిచింది. తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ఆ సినిమా గురించి ప్రస్తావించాడు. 

'బ్రహ్మోత్సవం' సినిమా ఫ్లాప్ కి నేనే కారకుడిని. స్క్రిప్ట్ పరమైన పొరపాటు కారణంగానే ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని పరిశీలన చేసినప్పుడు అయ్యో అనిపించింది. ఏ విషయాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లామో అదే మిస్ ఫైర్ అయిందనే సంగతిని గుర్తించాము" అని అన్నాడు. 

"థియేటర్స్ నుంచి టాక్ బయటికి రాగానే ముందుగా నాకు ఈశ్వరీరావు కాల్ చేశారు. "మీలో చాలా టాలెంట్ ఉంది .. అధైర్యపడకండి" అని అన్నారు. ఆ తరువాత అల్లు అరవింద్ గారు "ఎమోషన్స్ ను గొప్పగా చూపించే దర్శకులలో మీరు ఒకరు .. మరోసారి పెద్ద హిట్ ఇస్తారు" అని అన్నారు. ఇక మహేశ్ బాబు గారు "ఒక్కోసారి అలా జరుగుతుంటాయి" అన్నారు. వాళ్ల సపోర్టు నాకు ఊరటనిచ్చింది" అని చెప్పాడు. 
Srikanth Addala
Allu Aravind
Mahesh Babu

More Telugu News