British Crocodile Expert: డజన్ల కొద్దీ శునకాలపై అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలు పెట్టి చంపేసిన బ్రిటిష్ మొసళ్ల నిపుణుడు
- బీబీసీ, నేషనల్ జియోగ్రఫీలో పనిచేసిన ఆడం బ్రిట్టన్
- అరెస్టుకు 18 నెలల ముందు 42 శునకాలపై అత్యాచారం.. వాటిలో 39 మృతి
- ఈ మొత్తం ఘటనను రికార్డు చేసిన బ్రిట్టన్
- మొత్తం 60 అభియోగాలు
బ్రిటన్‌కు చెందిన మొసళ్ల నిపుణుడు ఆడం బ్రిట్టన్ దారుణ చర్యలకు పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. పదుల సంఖ్యలో శునకాలపై అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి చంపడంతోపాటు ఆ మొత్తం ఘటనను రికార్డు చేసినట్టు రుజువైంది. ప్రముఖ జంతుశాస్త్ర నిపుణుడైన ఆడం బీబీసీతోపాటు, నేషనల్ జియోగ్రాఫిక్ చానల్‌కు పనిచేశాడు. నిందితుడు ఎదుర్కొంటున్న 60 అభియోగాలలో ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీని యాక్సెస్ చేయడం కూడా ఒకటి.
కేసు విచారణ సందర్భంగా నార్తర్న్ టెరిటరీ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడి నేరాలు రికార్డు చేసి ఉన్నందున అవి చూసిన వారు ‘నెర్వస్ షాక్’కు గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి కోర్టు గది నుంచి బయటకు వెళ్లిపోవాలని హియిరింగ్ కోసం వచ్చిన వారిని కోరింది. 2014 నుంచి నిందితుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు.
జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన బ్రిట్టన్ శునకాలపై అత్యాచారానికి పాల్పడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు 18 నెలల ముందు 42 శునకాలపై అత్యాచారానికి పాల్పడగా వాటిలో 39 ప్రాణాలు కోల్పోయాయి. కాగా, ఆడంకు శిక్ష ఖరారు కావాల్సి ఉంది.