Siddaramaiah: అప్పులు చేసి పెళ్లిళ్లు చేయవద్దన్న కర్ణాటక ముఖ్యమంత్రి... ఎందుకంటే..!

Eschew extravagant wedding celebrations by obtaining loans says Siddaramaiah

  • సాధారణ, సామూహిక వివాహాలు ప్రోత్సహించాలని సూచన
  • రుణాలు పొంది, అప్పులు చేసి ఆడంబరంగా పెళ్లి చేయడం మానుకోవాలని వ్యాఖ్య
  • ఆడంబరాల కోసం చేసే అప్పులు తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సి వస్తోందన్న సీఎం

సమాజంలో సాధారణ, సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అప్పులు చేసి ఆడంబరంగా వివాహ వేడుకలు నిర్వహించవద్దన్నారు. మైసూరు సమీపంలోని చామరాజనగర్‌లోని ఎంఎం హిల్స్ టెంపుల్‌లో బుధవారం జరిగిన సామూహిక కల్యాణోత్సవంలో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ... అప్పులు చేసి లేదా రుణాలు పొంది వివాహ వేడుకలను ఘనంగా జరుపుకోవడం సరికాదన్నారు.

వ్యవసాయ రుణాలు పొంది ఆడంబరంగా పెళ్లి వేడుకలు నిర్వహించడం మానుకోవాలన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు గొప్పలకు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. బయట రుణాలు తీసుకువచ్చి ఆర్భాటంగా పెళ్లిళ్లు చేయడం ఎంతమాత్రం పద్ధతి కాదన్నారు. పేద, శ్రామిక వర్గాల ప్రజలు ఆడంబరాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సి వస్తోందన్నారు. అందుకే సమాజం నిరాడంబరంగా జరిగే సామూహిక వివాహాలను ప్రోత్సహించాలన్నారు.

  • Loading...

More Telugu News