Justin Trudeau: 'ఘోర తప్పిదం' అంటూ క్షమాపణలు చెప్పిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

Justin Trudeau apologizes after felicitating nazi veteran

  • కెనడా పార్లమెంట్ వేదికగా మాజీ నాజీ సైనికుడి సన్మానం వివాదాస్పదం
  • నాజీల అకృత్యాలకు బలైన వారి జ్ఞాపకాలను అవమానించడమేనని ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆగ్రహం
  • సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ట్రూడో బహిరంగ క్షమాపణలు

కెనడా పార్లమెంటు వేదికగా మాజీ నాజీ సైనికుడిని సన్మానించిన ఉదంతంలో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తాజాగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎదురుగా హాంకా (98) అనే మాజీ సైనికుడిని సన్మానించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీకి చెందిన నాజీ సైనికులు యూదులపై అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో స్వయంగా యూదుడైన జెలెన్‌స్కీ సమక్షంలో హంకాను సన్మానించడం నాటి బాధితుల జ్ఞాపకాలను అవమానించడమేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి. 

పార్లమెంటులో సన్మానానికి ఎవరిని ఎంపిక చేయాలనే నిర్ణయం ప్రధాని కార్యాలయానిదే కావడంతో జస్టిస్ ట్రూడోపై విమర్శలు చెలరేగాయి. ఈ ఘటనలో స్పీకర్ ఇప్పటికే తన పదవి నుంచి తప్పుకున్నారు. ఇక దిద్దుబాటు చర్యలకు దిగిన కెనడా ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఉక్రెయిన్‌కు క్షమాపణలు తెలిపింది. తాజాగా జస్టిస్ ట్రూడో 'అది ఘోర తప్పిదం' అంటూ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.

  • Loading...

More Telugu News