Facebook: ఫేస్ బుక్ లోగోలో మార్పును గమనించారా...?

Facebook changes its logo with more brightness

  • లోగోను మరింత బ్లూగా మార్చిన ఫేస్ బుక్
  • ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండానే లోగో మార్పు
  • చర్చించుకుంటున్న యూజర్లు  

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ తన లోగోను మరింత ప్రకాశవంతంగా మార్చింది. ఇప్పటివరకు ఎఫ్ అనే తెల్లని అక్షరం చుట్టూ లేత నీలం రంగు ఉండేది. ఇప్పుడా నీలం రంగు మరింత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎలాంటి అప్ డేట్ లేకుండానే లోగో రంగును మరింత షైనీగా మార్చడంతో ఫేస్ బుక్ యూజర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా లైట్ బ్లూ కలర్ లోగోను కొనసాగిస్తున్న ఫేస్ బుక్... ఇప్పుడు బ్రైట్ నెస్ తో కూడిన లోగోతో కాస్త కొత్తగా కనిపిస్తోంది. నెటిజన్లు ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News