Sourav Ganguly: మమతా బెనర్జీతో కలిసి స్పెయిన్ వెళ్లడంపై విమర్శలు.. నాకు నచ్చిన చోటుకు వెళ్తానంటూ గంగూలీ ఘాటు సమాధానం

Sourav Ganguly breaks silence on his Spain trip with Mamata Banerjee

  • మమతతో కలిసి స్పెయిన్ లో బెంగాల్ పెట్టుబడి ప్రణాళిక ప్రకటించిన గంగూలీ
  • బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు
  • తనకు ఎలాంటి రాజకీయ అనుబంధం లేదన్న మాజీ క్రికెటర్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు స్పెయిన్‌కు వెళ్లి అక్కడ ‘బెంగాల్‌ పెట్టుబడి ప్రణాళిక’ను ప్రకటించిన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వార్తల్లో నిలిచారు. దీనిపై బీజేపీ, కాషాయ శిబిరం నుంచి విమర్శలు వచ్చాయి. దీనికి గంగూలీ తనదైన శైలిలో స్పందించి విమర్శలను తిప్పికొట్టారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నాడు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంలో రచ్చ సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వారందరూ ఆ పని మానుకోవాలని సూచించాడు. 

‘నేనో స్వతంత్ర వ్యక్తిని. ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రినో, కౌన్సిలర్నో కాదు. నాకు ఎలాంటి రాజకీయ అనుబంధం లేదు. నాకు నచ్చిన చోటికి వెళ్తాను. నేను ఎక్కడికి వెళతాననే విషయంలో ఎవ్వరికీ జవాబుదారీ కాదు. ఎక్కడ బాగుందనిపిస్తే అక్కడికి వెళ్తాను. నాకు ప్రపంచం నుంచి ఆహ్వానం అందుతోంది’ అని గంగూలీ స్పష్టం చేశాడు. తాను సరైన స్థితిలో ఉన్నంత వరకు తన ఇష్టం వచ్చినట్లు చేస్తానని చెప్పాడు. ప్రజల్లో తనలాంటి వారికి విశ్వాసం ఉందన్న గంగూలీ తనకు ఎలాంటి రాజకీయ అజెండా లేదని తేల్చి చెప్పాడు.

  • Loading...

More Telugu News