Adani Companies: అదానీ కంపెనీల్లో భారీ నష్టాలకు షేర్లను విక్రయిస్తున్న అబుదాబి కంపెనీ ఐహెచ్ సీ
- అదానీ గ్రీన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లో వాటాల అమ్మకం
- కొనుగోలుదారుతో ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించిన ఐహెచ్ సీ
- ఇన్వెస్ట్ చేసిన ధర కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న షేర్లు
అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన 18 నెలల్లోనే అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్ సీ (ఐహెచ్ సీ) భారీ నష్టాలకు విక్రయించనుంది. ఈ సంస్థ 18 నెలల క్రితం మూడు అదానీ గ్రూపు కంపెనీల్లో రూ.15,400 కోట్లు (2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీలో రూ.3,850 కోట్లు, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లో రూ.3,850 కోట్లు, అదానీ ఎంటర్ ప్రైజెస్ లో రూ.7,700 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసింది.