Betting: విశాఖలో ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

Betting gang arrested in Vizag

  • ముఠాకు చెందిన 11 మంది అరెస్ట్.. మరికొందరి కోసం గాలింపు
  • 63 బ్యాంక్ అకౌంట్ల ద్వారా రూ. 367 కోట్ల లావాదేవీలు
  • అకౌంట్లను సీజ్ చేసిన పోలీసులు

విశాఖలో అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వలపన్ని ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశామని, మరికొందరి కోసం గాలిస్తున్నామని డీసీపీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ముఠాలో వాసుదేవరావు, దినేశ్ అలియాస్ మోను ప్రధాన నిందితులని వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ ఆదేశాల మేరకు బెట్టింగ్ వ్యవహారంపై లోతుగా చర్చిస్తున్నామని చెప్పారు.  

ఈ బెట్టింగ్ ముఠా 63 బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించిందని... వీటి ద్వారా రూ. 367 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని డీసీపీ తెలిపారు. 32 అకౌంట్లలో ఇంకా రూ. 75 లక్షలు ఉన్నాయని... దీంతో ఆయా బ్యాంకులను సంప్రదించి ఆ అకౌంట్లను సీజ్ చేయించామని చెప్పారు. 11 మంది అకౌంట్ల నుంచి ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయో తెలుసుకుంటున్నామని వెల్లడించారు. 

అనకాపల్లికి చెందిన సూరిబాబు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. తొలుత వివిధ ఆన్ లైన్ యాప్స్ లో బెట్టింగ్ ప్రారంభించిన సూరిబాబు కొన్ని రోజులకే బుకీగా మారాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు, ఐపీఎల్ మ్యాచ్ ల సమయాలలో బెట్టింగ్ నిర్వహించేవాడు. ఒక్కో మ్యాచ్ కు 20 నుంచి 30 మందితో బెట్టింగ్ ఆడిస్తూ నాలుగైదు లక్షలు జమ చేసేవాడు. ఏడాదికి రూ. 5 నుంచి 6 కోట్ల లావాదేవీలు జరిపేవాడు. ఈ బెట్టింగ్ డబ్బులను ఎవరికీ అనుమానం రాకుండా టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని అయిన దినేశ్ కు పంపించేవాడు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News