Liquor Policy: 2023-24 ఏడాదికి మద్యం విధానం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Govt announces liquor policy

  • 2019 నాటి విధానమే కొనసాగించాలని సర్కారు నిర్ణయం
  • నోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ
  • రాష్ట్రంలో 2,934 మద్యం దుకాణాలు
  • వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు లైసెన్సుల కొనసాగింపు
  • మద్యం దుకాణాల్లో డిజటల్ చెల్లింపులకు అనుమతి

ఏపీ ప్రభుత్వం 2023-24 ఏడాదికి మద్యం విధానం ప్రకటించింది. 2019 నాటి విధానమే ఈ ఏడాది కూడా కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఈ మేరకు తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. 

రాష్ట్రంలో 2,934 మద్యం దుకాణాలు కొనసాగుతాయని వెల్లడించింది. దుకాణాల లైసెన్సు కాల పరిమితి 2024 సెప్టెంబరు 30 వరకు వర్తిస్తుందని వివరించింది. నిర్దేశిత ఫీజు చెల్లించాక రిటైల్ దుకాణాలు, బార్ల లైసెన్సులు పొడిగిస్తారని ప్రభుత్వం పేర్కొంది. దుకాణాల సంఖ్యలో మార్పు లేకుండా, వాక్ ఇన్ స్టోర్లకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం సమ్మతించింది. టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలో మద్యం అవుట్ లెట్లు, వాక్ ఇన్ షాపులకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. 

మద్యం సీసాలపై హోలోగ్రామ్ ద్వారా ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, మద్యం దుకాణాల్లో ఇకపై డిజిటల్ చెల్లింపులు కూడా అనుమతిస్తారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News