Nitin Gadkari: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సులో ప్రయాణించిన నితిన్ గడ్కరీ... ఫొటోలు ఇవిగో!

Nitin Gadkari test rides world longest overhead power electric trolley bus in Prague

  • చెక్ రిపబ్లిక్ దేశంలో నితిన్ గడ్కరీ పర్యటన
  • ప్రేగ్ నగరంలో ఎలక్ట్రిక్ ట్రాలీ బస్ టెస్ట్ రైడ్
  • మెరుగైన రవాణా ప్రత్యామ్నాయాలుగా ఈ బస్సులను అభివర్ణించిన గడ్కరీ
  • ఖర్చు తక్కువ అని వెల్లడి

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ యూరప్ దేశం చెక్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోలు, వీడియోను పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఓవర్ హెడ్ పవర్ ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సులో టెస్ట్ రైడ్ లో పాల్గొన్నట్టు వెల్లడించారు. ప్రేగ్ నగరంలో ఈ టెస్ట్ రైడ్ చేపట్టారని వివరించారు. 

ఈ బస్సు పొడవు 24 మీటర్లు. చెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కొడా ఈ ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సును అభివృద్ధి చేసింది. 

ప్రస్తుతం ఈ బస్సు ప్రయోగాత్మక దశలో ఉందని గడ్కరీ తెలిపారు. ఒక్కసారి ఇది రోడ్డెక్కితే, మెట్రో నగరాల్లో రవాణా ఎంతో చవకగా మారుతుందని వివరించారు. మెట్రో రైళ్ల మాదిరిగా ఈ బస్సులకు ప్రత్యేక ట్రాక్ లైన్లు ఉంటాయని, ఇవి నగరాల్లో తక్కువ ఖర్చుతో మెరుగైన రవాణా ప్రత్యామ్నాయాలుగా మారతాయని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి బస్సులతో ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను మరింత విస్తరించవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News