KTR: కళ్లు చెదిరేలా నల్గొండ ఐటీ హబ్... ఫొటోలు పంచుకున్న కేటీఆర్
- చిన్న పట్టణాల్లో ఐటీ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు
- 2021లో నల్గొండ ఐటీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన
- తాజాగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఐటీ హబ్
నల్గొండ పట్టణంలో నూతనంగా రూపుదిద్దుకున్న ఐటీ హబ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొత్తగా ప్రారంభమైన నల్గొండ ఐటీ హబ్ బహుశా నిర్మాణ పరంగా, కార్యాచరణ పరంగా అత్యుత్తమం అని కొనియాడారు.
హైదరాబాదులోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లోనూ ఐటీ రంగాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నల్గొండలో 2021 డిసెంబరు 31న ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. కాగా, నల్గొండ ఐటీ హబ్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే 17 సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. తొలుత 1200 మంది ఉద్యోగులను నియమించుకోవాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.