Nara Lokesh: నారా లోకేశ్ కు ముందస్తు బెయిల్ పొడిగింపు

Nara Lokesh bail extended in skill development case
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పొడిగింపు 
  • ఈ నెల 12 వరకు బెయిల్ పొడిగించిన హైకోర్టు
  • అప్పటి వరకు లోకేశ్ కు భద్రత కల్పించాలని ఆదేశం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు స్వల్ప ఊరటను ఇచ్చింది. ఈ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. లోకేశ్ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఈరోజుతో ముగుస్తోంది. అప్పటి వరకు వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవని.. అందువల్ల వచ్చే బుధవారానికి విచారణను వాయిదా వేయాలని కోర్టును ఆయన కోరారు. దీంతో, విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు లోకేశ్ కు భద్రతను కల్పించాలని ఆదేశించింది. 

Nara Lokesh
Telugudesam
AP High Court
Skill Development Case
Bail

More Telugu News