Chandrababu: నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో టీడీపీ అధినేత
- వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం
- ఈ విషయమై తమకు ఇంకా ఆదేశాలు అందలేదన్న జైలు పర్యవేక్షణాధికారి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు రెండోసారి విధించిన జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో, ఆయన మరోమారు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంలో తమకు ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదని జైలు పర్యవేక్షణాధికారి రాహుల్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందితే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
తొలి రిమాండ్ ముగిశాక చంద్రబాబు కోర్టు ఎదుట వర్చువల్‌గానే హాజరయ్యారు. అప్పట్లో కోర్టు సీఐడీ కస్టడీకి అనుమతించడంతో అధికారులు జైల్లోనే చంద్రబాబును రెండు రోజుల పాటు విచారించారు. ఆ తరువాత కూడా వర్చువల్ విధానంలోనే టీడీపీ అధినేత న్యాయమూర్తి ముందు హాజరుకాగా జడ్జి ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకూ పొడిగించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే.