Google Pixel 8: ఇండియాకు వచ్చేసిన గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Google introduces Pixel 8 and Pixel 8 Pro in India

  • నిరాశ పరిచే అవుట్ డేెటెడ్ లుక్
  • మిగతా ఫీచర్లు మాత్రం అత్యద్భుతం
  • వైర్, వైర్‌లెస్ చార్జింగ్ కూడా
  • ఘనమైన కెమెరాలు
  • ఏడేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ హామీ

గూగుల్ ఇటీవల ఆవిష్కరించిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో భారత మార్కెట్లోకి వచ్చేశాయి. లుక్ కాస్తంత అవుట్ డేటెడ్‌గా ఉన్నప్పటికీ సీపీయూ, కెమెరాలను మెరుగుపరిచారు. అయితే, డిజైన్, బిల్డప్ క్వాలిటీ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. ఇందులో టెన్సార్ జీ3 చిప్, 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ ఉన్న ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌ను ఉపయోగించారు. ఈ రెండింటిలో ఫొటో అన్‌బ్లర్, లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఏడేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ హామీ ఉంది. 

గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ధరలు
గూగుల్ పిక్సెల్ 8 ధర ఇండియాలో రూ. 75,999 మాత్రమే. ఇది 128 జీబీ సింగిల్స్ స్టోరేజీ మోడల్‌లో అందుబాటులో ఉంది. హేజెల్, ఒబ్సిడియాన్, రోజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 8 ప్రో 128 జీబీస్టోరేజీ ధర రూ. 1,06,999 మాత్రమే. ఇందులో బే, ఒబ్సిడియాన్, పోర్సెలిన్ రంగులు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. నిన్నటి నుంచి ప్రీ ఆర్డర్లు కూడా మొదలయ్యాయి. గూగుల్ తొలిసారి ఈ నెల 12న స్మార్ట్‌వాచ్.. పిక్సెల్ వాచ్ 2 నుంచి భారత్‌లో లాంచ్ చేస్తోంది. దీని ధర రూ. 39,900. 

ఆకర్షణీయ ఆఫర్లు 
పిక్సల్ ఫోన్లపై గూగుల్ ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా పిక్సెల్ 8 కొనుగోలు చేస్తే రూ. 8 వేల తగ్గింపు లభిస్తుంది. ఎక్స్‌చేంజ్‌పై రూ. 3 వేల రాయితీ లభిస్తుంది. పిక్సెల్ 8 ప్రో కొనుగోలుపై రూ. 9 వేలు, మార్పిడిపై రూ. 4 వేలు రాయితీ లభిస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి కొనుగోలు చేసే ఇండియన్ యూజర్లు పిక్సెల్ వాచ్ 2ను రూ. 19,999కే దక్కించుకోవచ్చు. అలాగే, పిక్సెల్ బడ్స్ ప్రోను రూ. 8,999కే సొంతం చేసుకోవచ్చు. 

గూగుల పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా.. 
ఈ రెండు ఫోన్లు డ్యూయల్ సిమ్‌తో వస్తున్నాయి. అవుటాఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్. పిక్సెల్ 8లో 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ స్క్రీన్‌తో 90 హెర్ట్స్ రీఫ్రెష్ రేట్‌తో రాగా, పిక్సెల్ 8 ప్రోలో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్‌తో వస్తోంది. ఈ రెండింటిలో గూగుల్ నోనా కోర్ టెన్సార్ జీ3 చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ ఉపయోగించారు. పిక్సెల్ 8లో 8జీబీ ర్యామ్, పిక్సెల్ 8 ప్రోలో 12జీబీ ర్యామ్ ఉపయోగించారు.  

కెమెరా భేష్
కెమెరా విషయానికి వస్తే పిక్సెల్ 8, 8 ప్రో ఫోన్లు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తున్నాయి. పిక్సెల్ 8లో 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉపయోగించగా, 8 ప్రోలో 64 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రో మోడల్‌లో మూడో సెన్సార్‌గా  48 ఎంపీ టెలీఫొటో కెమెరాను వాడారు. సెల్ఫీల కోసం రెండు ఫోన్లలోనూ ముందువైపు 11 మెగాపిక్సల్ కెమెరా ఉంది.

256 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ
స్టోరేజీ విషయానికి వస్తే రెండు ఫోన్లలోనూ ఇన్‌బిల్ట్‌గా 256 జీబీ ఉంది. వై-ఫై 6ఈ, 5జీ, 4జీ ఎల్‌టీటీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ కలిగిన ఈ ఫోన్లలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును వాడారు. పిక్సెల్ 8లో 4,575 ఎంఏహెచ్, ప్రో వెర్షన్‌లో 5,050 ఎంఏహెచ్ బ్యాటరీలను ఉపయోగించారు. ఇవి వరుసగా 27 వాట్స్, 30 వాట్స్ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. వైర్‌లెస్ చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. 30 నిమిషాల్లో 50 శాతం, 100 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News