Vande Bharat: వందే భారత్ కు ఆరెంజ్ కలర్.. పాలిటిక్స్ కాదు సైన్స్: రైల్వే మంత్రి
- శాస్త్రీయమైన ఆలోచనతోనే ఈ రంగును ఎంపిక చేసినట్టు స్పష్టీకరణ
- మనుషుల కంటికి ఎల్లో, ఆరెంజ్ మెరుగ్గా కనిపిస్తాయని వెల్లడి
- కొన్ని ఉదాహరణలు ప్రస్తావించిన రైల్వే మంత్రి
వందేభారత్ కొత్త రైళ్లపై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే మంత్రి స్పందించారు. కాషాయ రంగు వేయడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శాస్త్రీయపరమైన ఆలోచనతోనే ఈ రంగును ఎంపిక చేసుకున్నట్టు మంత్రి చెప్పారు.