USa India Ties: భారత్ తో సంబంధాలు దెబ్బతినొచ్చు..: అమెరికా రాయబారి
- కొంత కాలానికి భారత్-అమెరికా సంబంధాలు బలహీన పడొచ్చన్న అమెరికా రాయబారి
- ఈ విషయంలో అమెరికా అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం
- దీనికి భిన్నంగా బైడెన్ ప్రభుత్వంలోని కొందరి సభ్యుల వాదన
భారత్-కెనడా మధ్య వివాదం చివరికి ఏ మలుపు తీసుకుంటుందో అర్థం కాకుండా ఉంది. ఖలిస్థానీ ఉగ్రవాది (కెనడా దృష్టిలో నేత, సొంత పౌరుడు) హర్దీప్ సింగ్ నిజ్జర్ ను జూన్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపగా, భారత ఏజెంట్లే ఈ పని చేసినట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం తెలిసిందే. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయంటూ, ఇదే విషయాన్ని ఐదు దేశాల ఇంటెలిజెన్స్ కూటమి (ఫైవ్ ఐస్/అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, కెనడా)కి నివేదించారు.