Pawan Kalyan: టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలి... ఆ రోజు నేనన్నది ఏంటంటే...!: పవన్ కల్యాణ్

Pawan Kalyan gives explanation to TDP leaders

  • ముదినేపల్లిలో పవన్ సభ
  • జనసేన, టీడీపీ పదేళ్లు కలిసి పనిచేయాల్సి ఉందని వెల్లడి
  • 2014లో జనసేన, టీడీపీ మధ్య మాట మాట పెరిగి విడిపోయినట్టు వివరణ
  • ఇప్పుడు రాష్ట్రం కోసం కలిసి వెళుతున్నామని ఉద్ఘాటన

జనసేన, టీడీపీ కలిసి పదేళ్లు పనిచేయాల్సి ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ముదినేపల్లిలో వారాహి విజయ యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడంతో శ్రీకాకుళంలో తనను ప్రజలు ప్రశ్నించారని, దాంతో పొత్తు నుంచి బయటికి వచ్చానని పవన్ వెల్లడించారు. ఆ తర్వాత మాట మాట అనుకున్నామని, విడిపోయామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రం కోసం కలిసి వెళుతున్నామని వెల్లడించారు. 

"టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలి. మేం మీకు స్నేహ హస్తం అందించాం. మీరు కూడా అదే విధంగా మా వాళ్లతో స్నేహంగా ఉండండి. గతంలో గొడవలు పక్కనబెట్టండి. చంద్రబాబుతో విభేదాలు ఉన్నప్పటికీ నేను రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయనను కలిశాను. 

2014లో నేను టీడీపీకి అండగా నిలిచినప్పుడు, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ రోజూ కూడా నా వల్లనే గెలిచింది అని చెప్పలేదు. నేను అన్నది ఏంటంటే... మేం మద్దతు ఇచ్చాం, ఏం ఆశించలేదు... ఒక్క ఓటు మా వల్ల పడినా దానికి కృతజ్ఞత అనేది ఉండాలని చెప్పాను" అని పవన్ వివరించారు.

  • Loading...

More Telugu News