Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ
- తీర్పును సోమవారానికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- ప్రభుత్వం తరపున పొన్నవోలు, బాబు తరపున దూబే వాదనలు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం నాడు (9వ తేదీ) తీర్పును వెలువరిస్తామని జడ్జి ప్రకటించారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు కూడా సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. కోర్టులో ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు.