Nara Lokesh: నేను మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్లు కోరలేదు: నారా లోకేశ్
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- రాజమండ్రి జైలులో జ్యుడిషియల్ రిమాండ్
- నేడు చంద్రబాబును కలిసిన లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి
చంద్రబాబుతో రాజమండ్రి జైలులో ములాఖత్ అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాను ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు కోరలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తాను ఏ అంశంపైనా మాట్లాడనని అన్నారు.