Green Chilli: పచ్చి మిరప, ఎండు మిరపలో ఏది ఎక్కువ మంచిది?

Green Chilli or Red Chilli Which one is healthier

  • పచ్చి మిరపతో ప్రయోజనాలు ఎక్కువ
  • పచ్చి మిరపతో డైటరీ ఫైబర్ లభిస్తుంది
  • జీర్ణానికి మంచిది, బ్లడ్ షుగర్ నియంత్రణ
  • ఎండు కారంతో పెప్టిక్ అల్సర్ల ప్రమాదం

వంటల్లో పచ్చి మిరపకాయలు వినియోగించే వారు కొందరు. పండు మిరపకాయలను అలాగే, ఎండు  కారాన్ని వాడే వారు మరికొందరు. రెండింటి రుచి వేర్వేరు. ఒక్కో వంటకానికి ఒక్కోటీ వాడుతుంటారు. రుచి విషయం పక్కన పెట్టి, వీటిల్లో ఏ రకం ఎక్కువ లాభకరమో ఒకసారి తెలుసుకుందాం.

పచ్చి మిరప 
  • ఎండు మిరప కారంతో పోలిస్తే పచ్చి మిరప ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం. పచ్చి మిరపలో నీటి పరిమాణం ఎక్కువ. కేలరీలు ఉండవు. దీంతో కేలరీలు తగ్గించుకోవాలని కోరుకునే వారు పచ్చి మిరపకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. 
  • పచ్చి మిరపను రోజువారీ తీసుకుంటే బ్లడ్ షుగర్ నియంత్రణకు సాయపడుతుంది. 
  • పచ్చి మిరపలో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల ఎండార్ఫిన్ల విడుదల ఎక్కువగా ఉంటుంది. 
  • వీటిల్లో డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఆహారం మంచిగా జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది. 
  • బీటా కెరోటిన్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. 

ఎండు కారం
  • ఎండు కారం మోతాదు మించి తీసుకుంటే ఇన్ ఫ్లమ్మేషన్ కు దారితీస్తుంది. దీంతో పెప్టిక్ అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. పైగా నేడు ఎండు మిరప కారం స్వచ్ఛమైన రూపంలో లభించడం లేదు. మంచి రంగు రావాలని చెప్పి కృత్రిమ రంగులను కలుపుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు.
  • ఎండు మిరప కారంలో పొటాషియం ఉండడం వల్ల బీపీ నియంత్రణకు సాయపడుతుంది. 
  • కారంలో క్యాప్సేసిన్ ఉండడం వల్ల జీవక్రియల రేటు పెరుగుతుంది. దీనివల్ల కేలరీలు కరిగిపోతాయి. అధిక బరువు ఉన్నవారికి ఎండు కారం, పచ్చి కారం రెండూ మంచివే. 
  • ఎండు మిరప, ఎండు కారం, పచ్చి మిరపకాయల్లోనూ విటమిన్ సీ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తికి సాయపడుతుంది. 
  • యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల గుండె, రక్త నాళాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
  • ఇక ఎండు కారం కంటే ఎండు మిరప కాయలే కాస్త నయం. అలాగే, పచ్చి మిరపకాయలు అయినా, పండు మిరపకాయలు అయినా వాటిని అదే రూపంలో తీసుకోవడం అన్నది, ఎండబెట్టి చేసిన కారం కంటే ఎక్కువ ప్రయోజకరం.

  • Loading...

More Telugu News