Team India: వరల్డ్ కప్: పట్టు సడలించిన ఆసీస్... విజయం దిశగా టీమిండియా
- చెన్నైలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్
- లక్ష్యఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
- 100 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్న కోహ్లీ, రాహుల్
చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ తొలుత 199 పరుగులకు ఆలౌట్ అయింది. 200 పరుగుల లక్ష్యఛేదన ఆరంభంలో టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఓటమి దిశగా పయనిస్తున్నట్టు అనిపించింది.
అయితే, టీమిండియాను విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జోడీ ఆదుకుంది. ఆరంభంలో కోహ్లీ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను మిచెల్ మార్ష్ జారవిడవడం బాగా ప్రభావం చూపింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ జోడీ 100 పరుగులు జోడించి భారత్ ను సురక్షితమైన స్థితికి చేర్చింది. కొత్త బంతితో నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు ఆ తర్వాత ప్రభావం చూపలేకపోయారు.
ప్రస్తుతం టీమిండియా స్కోరు 28 ఓవర్లలో 3 వికెట్లకు 116 పరుగులు. కోహ్లీ 59, కేఎల్ రాహుల్ 51 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా విజయం సాధించాలంటే 32 ఓవర్లలో 84 పరుగులు చేయాలి. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 2, స్టార్క్ 1 వికెట్ తీశారు.