Chandrababu: చంద్రబాబు మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
- రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్లు
- మూడు పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు
- టీడీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన దరఖాస్తు చేసుకున్న మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఏ24గా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా, అంగళ్లు కేసులో ఏ1గా ఉన్నారు.
అంగళ్లు కేసులో ఇప్పటికే పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో... చంద్రబాబుకు ఈ కేసులో కచ్చితంగా బెయిల్ వస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే, హైకోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో సుప్రీంకోర్టును టీడీపీ ఆశ్రయించే అవకాశం ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది.