ICC World Cup: వరల్డ్ కప్: టాస్ గెలిచిన నెదర్లాండ్స్... భారీ స్కోరుపై కన్నేసిన న్యూజిలాండ్
- వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
- 25 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 135 పరుగులు చేసిన కివీస్
- ఈ మ్యాచ్ లోనూ కివీస్ జట్టుకు టామ్ లాథమ్ నాయకత్వం
వరల్డ్ కప్ లో ఇవాళ న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ లక్ష్యఛేదనకు మొగ్గుచూపింది. టాస్ ఓడిపోవడంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరుపై కన్నేసింది.
ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 25 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 135 పరుగులు. ఓపెనర్ విల్ యంగ్ (66 బ్యాటింగ్) అర్ధసెంచరీతో రాణించగా, కొత్త చిచ్చరపిడుగు రచిన్ రవీంద్ర 31 పరుగులతో ఆడుతున్నాడు. అంతకుముందు, ఓపెనర్ డెవాన్ కాన్వే 32 పరుగులు చేసి వాన్ డెర్ మెర్వా బౌలింగ్ లో వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్ లోనూ న్యూజిలాండ్ జట్టుకు వికెట్ కీపర్ టామ్ లాథమ్ నాయకత్వం వహిస్తున్నాడు. రెగ్యులర్ సారథి కేన్ విలియమ్సన్ మ్యాచ్ ఫిట్ నెస్ తో లేడని తెలుస్తోంది.