Pradeep Eshwar: నియోజకవర్గాన్ని వదిలేసి బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Congress MLA Pradeep Eshwar enters into Bigg Boss show as contestant
  • 10వ సీజన్ లో ప్రవేశించిన కన్నడ బిగ్ బాస్ షో
  • కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన చిక్కబళ్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్
  • డప్పుల మోతల మధ్య అట్టహాసంగా బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించిన ఎమ్మెల్యే
ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షో 10వ సీజన్ నడుస్తోంది. నిన్న ఈ షో ప్రారంభం కాగా, ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా ఓ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. చిక్కబళ్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ డప్పుల మోతల మధ్య అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చారు. 

అయితే, సదరు ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ షో అంటే ఎలా లేదన్నా కనీసం 100 రోజులు జరుగుతుంది. ఎలిమినేట్ కాకుండా ఉంటే, అన్ని రోజుల పాటు హౌస్ లో ఉండాల్సిందే. మరి, ఈ సమయంలో నియోజకవర్గం బాగోగులు ఎవరు చూస్తారంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఎమ్మెల్యే బిగ్ బాస్ పేరిట ఓ వినోద కార్యక్రమంలో పాల్గొనడం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ప్రజాసేవ చేస్తానని ప్రమాణం చేసి, బిగ్  బాస్ ఇంట్లో ప్రవేశించిన ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ పై చర్యలు తీసుకోవాలంటూ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ సిద్ధరామయ్యలకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందుతున్నాయి. 

ప్రదీప్ ఈశ్వర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కె.సుధాకర్ పై నెగ్గారు. కె.సుధాకర్ గత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.
Pradeep Eshwar
Bigg Boss
MLA
Contestant
Karnataka

More Telugu News