akshay kumar: న్యూజెర్సీలో ప్రపంచ రెండో అతిపెద్ద దేవాలయం... అక్షయ్ కుమార్ స్పందన
- అమెరికాలోనే అతిపెద్ద దేవాలయం అక్షరధామం
- 2011లో ప్రారంభమైన ఆలయ పనులు, ఇటీవలే ఆలయ ప్రారంభం
- గుజరాత్ బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం
అమెరికాలోని న్యూజెర్సీలో ప్రారంభించిన అతిపెద్ద హిందూ దేవాలయం అక్షరధామంపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. ఈ దేవాలయంపై ఆయన సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఇది అమెరికాలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం అయినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. గురు మహంత్ స్వామి మహారాజ్‌ను దర్శించుకున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. ఇదో అద్భుతమన్నారు.
ఈ దేవాలయ నిర్మాణ పనులు 2011లో ప్రారంభం కాగా, ఇటీవలే దీనిని ప్రారంభించారు. ఈ మందిర నిర్మాణం గుజరాత్‌కు చెందిన బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆధ్వర్యంలో జరిగింది. ఆలయానికి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఉక్కు, ఇనుము ఉపయోగించలేదు. వేలాది సంవత్సరాల పాటు చెక్కుచెదరని రీతిలో దీనిని నిర్మించారు.