Roshan: సుమ ఫేస్ ఇంతలా వెలిగిపోవడం నేనెప్పుడూ చూడలేదు: హీరో నాని

Bubble Gum movie teaser launch event
  • 'బబుల్ గమ్'తో పరిచయమవుతున్న రోషన్
  • టీజర్ లాంచ్ ఈవెంటులో మాట్లాడిన నాని 
  • రోషన్ హీరోగా సక్సెస్ అవుతాడని వ్యాఖ్య 
  • డిసెంబర్ 29న సినిమా వస్తుందని వెల్లడి
సుమ తనయుడు రోషన్ 'బబుల్ గమ్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంటును కొంతసేపటి క్రితం నిర్వహించారు. ఈ వేదికపై హీరో నాని మాట్లాడుతూ .. "రోషన్ మాట్లాడుతున్నప్పుడు సుమ ముఖం చూశాను .. బల్బులా వెలిగిపోతోంది. ఇన్ని ఫంక్షన్స్ లో నేను ఎప్పుడూ ఇలా చూడలేదు" అని అన్నాడు. 

"సాధారణంగా ఎవరికైనా స్టేజ్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది. స్టేజ్ పైనే పెరిగినట్టున్నాడు .. మనవాడిలో అలాంటి భయమేమీ కనిపించలేదు. తనకి మొత్తం ఇండస్ట్రీ  వైపు నుంచి .. ఆడియన్స్ వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది. నాకు తెలిసి రిలీజ్ కి ముందే సుమ గారు ఇండస్ట్రీ మొత్తాన్ని దించేస్తారు" అని సి చెప్పాడు. 
 
ఫస్టు సినిమాలో కాస్త తడబడటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా రోషన్ చాలా సాలీడ్ గా చేశాడు. నాకైతే ఒక్క ఫాల్స్ నోట్ కూడా కనిపించలేదు. తనని చూస్తుంటే మరో సక్సెస్ ఫుల్ హీరో ఇండస్ట్రీకి వచ్చినట్టే అనిపిస్తోంది. మానసతో తన కెమిస్ట్రీ బాగా కుదిరింది. డిసెంబర్ 29వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది .. తప్పకుండా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు. 

Roshan
Manasa
Nani
Suma

More Telugu News